TS TET 2022 Exam Tips: TET Exam Syllabus ప్రకారం చక్కని ప్రణాళికతో చదివితే మంచి ఫలితం కనిపిస్తుంది.ప్రతిరోజూ TET Previous Papers ప్రాక్టీస్ చేయాలి.TET మోడల్ పేపర్లు సాధ్యమైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి.మనం వెనుక బడిన విషయాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి.
సమయం తక్కువగా ఉంది.పోటీ ఎక్కువగా ఉంది. అంతే కాకుండా ఈసారి జీవితం కాలం వాలిడిటీ ఉంది. డియస్సీ నోటిఫికేషన్ విడుదల కూడా త్వరలో రానున్నది. కావున ఈ సువర్ణ అవకాశం అసలు మిస్ చేసుకోకుండా ఈ టిప్స్ పాటించండి.
- TET Exam Syllabus ప్రకారం చక్కని ప్రణాళికతో చదివితే మంచి ఫలితం కనిపిస్తుంది.
- ప్రతిరోజూ TET Previous Papers ప్రాక్టీస్ చేయాలి.
- TET మోడల్ పేపర్లు సాధ్యమైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి.
- మనం వెనుక బడిన విషయాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి.
- పేపరు-1కి అయితే 1నుండి 5 తరగతులు పుస్తకాలు చదవడంతో పాటు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి.
- పేపరు-2కి అయితే 6 నుండి 10 తరగతుల పుస్తకాలను చదవడం ద్వారా మంచి ఫలితం సాధించవచ్చు.
- తెలుగు కవులు, వ్యాకరణాంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి.
- ఇంగ్లీష్ గ్రామర్ కూడా బాగా ప్రిపేర్ కావాలి.
- సందేహాలు నివృత్తి చేసుకుంటూ, మనం స్కోర్ తక్కువ చేస్తున్నవాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
- మంచి నిష్ణాతులైన వారిచే రూపొందించిన పుస్తకాలు చదవడంతో పాటు నోట్స్ రాసుకోవడం మంచిది.
Telangana TET 2022: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పరీక్షకు దరఖాస్తులు భారీగా వచ్చాయి. దరఖాస్తు చివరి తేది వరకు అంటే ఏప్రిల్ 12 నాటికి మొత్తం 6,26,928 దరఖాస్తులు చేసినట్లు టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. పేపర్-1కు 3,50,205, పేపర్-2కు 2,76,723 దరఖాస్తులు వచ్చాయని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
B.Ed, D.Ed ఫైనలియర్ విద్యార్థులూ అర్హులే:
బీఈడీ, డీఈడీ చదువుతున్న చివరి సంవత్సరం విద్యార్థులు కూడా టెట్ రాసుకునేందుకు అవకాశం కల్పించారు. కావున పోటీ ఎక్కువగా ఉంటుంది. 2017 టెట్ సిలబస్ ప్రకారమే ఈ సారి పరీక్షలు నిర్వహించనున్నారు. హెల్ప్ డెస్క్ సేవలు మార్చి 26 నుంచి జూన్ 12వ తేదీ వరకు అందుబాటులో ఉండనున్నాయి. అభ్యర్థులు వీటిని వినియోగించుకోవచ్చు. సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.
ఆన్లైన్ లో జూన్ 6 నుంచి TET Halltickets:
జూన్ 12న టెట్ పరీక్షను నిర్వహించి 27న ఫలితాలు విడుదల చేయనున్నారు. జూన్ 6 నుంచి టెట్ హాల్ టికెట్స్‌ను సంబంధిత వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. https://tstet.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో టెట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను పొందుపరిచారు. అభ్యర్థులు సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
Post a Comment