తెలంగాణ డిపార్ట్మెంటల్ టెస్ట్ నవంబర్-2020 నోటిఫికేషన్ విడుదల
TSPSC Departmental Tests November 2020 :
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC), హైదరాబాద్ వారు నవంబర్-2020 సెషన్ డిపార్ట్మెంటల్ టెస్ట్స్ నిర్వహించుటకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
Official website link : https://www.tspsc.gov.in/departmentalTest.jsp
ముఖ్యమైన తేదీలు :
- నోటిఫికేషన్ జారీ తేదీ : 11-12-2020
- ఆన్లైన్ లో అప్లికేషన్ ప్రారంభ తేదీ : 16-12-2020
- ఆన్లైన్ లో అప్లికేషన్ చివరి తేదీ : 31-12-2020
- ఫీజు చెల్లింపు చివరి తేదీ : 31-12-2020
- పరీక్షల తేదీలు : 27-01-2021 నుండి 03-02-2021
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) , హైదరాబాద్ వారు నవంబర్-2020 సెషన్ డిపార్ట్మెంటల్ టెస్ట్స్ నిర్వహించుటకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ పూర్తిగా ఆన్లైన్ లో అప్లై చేయాలి.ఈ పరీక్ష మాత్రం పూర్తిగా ఆఫ్ లైన్ ఓయంఆర్ పద్దతి ప్రకారం నిర్వహించనున్నారు.
TSPSC Departmental Tests నవంబర్-2020 సెషన్ నోటిఫికేషన్ నెం. 11/2020 ప్రకారం డిపార్ట్మెంటల్ టెస్ట్స్ ను తెలంగాణ రాష్ట్రంలో 9 జిల్లా కేంద్రాలతో పాటు హైదరాబాద్ , రంగారెడ్డి జిల్లా పరిధిలోని హెచ్ఎండిఏ పరిధిలో పరీక్షలు నిర్వహించనున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షల హాల్ టికెట్స్ పరీక్షలు నిర్వహించే వారం రోజుల ముందు అందుబాటులో ఉంటాయని కమీషన్ సభ్యులు తెలిపారు.
పరీక్ష సమయం :
TSPSC డిపార్ట్మెంటల్ టెస్ట్స్ పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి.రెండు గంటల సమయంలో పూర్తి చేయవలసి ఉంటుంది. రెండు సెషన్స్ లో పరీక్ష ఉంటుంది. మొదటి సెషన్ 10 గంటల నుండి 12 గంటల వరకు, రెండవ సెషన్ 2-30 నుండి 4-30 వరకు ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు :
TSPSC పరీక్షలు నిర్వహించే జిల్లా కేంద్రాలు అదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి మరియు ఢిల్లీ లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
TSPSC డిపార్ట్మెంటల్ టెస్ట్స్ అప్లికేషన్ ఆన్ లైన్ లో చేయవలసి ఉంటుంది. పూర్తి వివరాల కోసం TSPSC అఫిషియల్ వెబ్ సైట్ సందర్శించవలెను.ఆ TSPSC వెబ్ సైట్ వివరాలు ఈ క్రింది ఇవ్వబడ్డాయి.
ఫీజు వివరాలు :
TSPSC Departmental tests అప్లికేషన్ ఫీజు 200 రూ. ప్రతి ఒక్కరూ చెల్లించాలి. మరియు అదనంగా ఒక పేరుకు 100రూ. చెల్లించాలి. దీనికి చివరి తేదీ 31 డిసెంబర్ 2020. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన TSPSC వెబ్ సైట్ లో ఇవ్వడం జరిగింది. ఏమైనా మార్పులు చోటు చేసుకున్నా మీరు అధికారిక TSPSC వెబ్సైట్ చూడండి.
ECHS 64kb Card Status | ECHS 64kb Card
ReplyDeletePost a Comment