టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.... పబ్లిక్ పరీక్షల్లో భారీ మార్పులపై తాజా అప్డేట్ | ismart badi

TS 10th Class Exams (2020-21): విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే విధంగా విద్యాశాఖ సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.







ముఖ్యమైన మార్పులు :

  • పరీక్షల్లో 11 పేపర్లు 6 కు కుదించే యోచన
  • పరీక్షా సమయం గంటన్నరకు కుదింపు
  • ప్రశ్నాపత్రంలో భారీ మార్పు లు
  • ఆబ్జెక్టివ్ ప్రశ్నలు పెంపు
  • డిస్క్రిప్టివ్ ప్రశ్నల ఛాయిస్ పెంపు

తెలంగాణ విద్యాశాఖ విద్యార్థుల సౌకర్యార్థం పలు అంశాలపై సుదీర్ఘంగా మేదోమథనం చేస్తోంది. కరోనా కారణంగా అస్తవ్యస్తంగా మారిన విద్యా వ్యవస్థను గాడిన పెట్టడమే కాకుండా.. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే విధంగా సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.





తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలలో 70 శాతం మేరకే సిలబస్ మాత్రమే బోధించడం జరుగుతున్నది .30 శాతం యాక్టివిటీ బేస్డ్ కార్యకలాపాలకు కేటాయిస్తున్నారు. ఇక పరీక్షలను 11 కు బదులుగా 6 మాత్రమే నిర్వహించాలని భావిస్తున్నారు. ప్రతి సబ్జెక్టుకు ఒక్క పేపర్ మాత్రమే ఉండేలా రూపొందిస్తున్నారు .ఇక పరీక్షల సమయాన్ని కూడా రెండున్నర గంటల బదులుగా గంటన్నర మాత్రమే నిర్వహించే అవకాశం ఉంది. అలాగే ప్రశ్నాపత్రంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి .


సబ్జెక్టుకు ఒక పేపరు:
ఈ విద్యా సంవత్సరం (2020-21)లో సబ్జెక్టుకు ఒక పేపరు చొప్పున మొత్తం ఆరు పరీక్షలే నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇక పరీక్షా సమయాన్ని కూడా రెండున్నర గంటలకు నుంచి గంటన్నరకు కుదించే అవకాశాలున్నాయి. అలాగే ప్రశ్నా పత్రంలో కూడా పలు మార్పులు జరిగే సూచనలున్నాయి.





ఎక్కువ ఆప్షన్లు:

ఒకవేళ వ్యాస రూపంలో పరీక్షలు నిర్వహించడం కుదరక పోతే ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రైవేటు విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఈసారి ప్రశ్నాపత్రం రూపొందిస్తున్నారు . ఏది ఏమైనా పరీక్షలలో మార్పులు అనివార్యం అని అధికారులు వెల్లడిస్తున్నారు.పరీక్షలను ఏప్రిల్ నెలలో లేదా మే నెలలో ప్రత్యక్ష బోధన అనంతరం నిర్వహించనున్నారు.ఎక్కువ ప్రశ్నలు ఇచ్చి సమాధానాలు రాసేందుకు ఆప్షన్లు కూడా ఎక్కువగా ఇచ్చే ఆలోచనలో విద్యాశాఖ ఉన్నట్లు సమాచారం .



గ్రాండ్‌ టెస్ట్‌తో ప్రమోట్‌:

కరోనా కారణంగా.. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ తరగతుల విద్యార్థులకు కూడా వార్షిక పరీక్షలను ఆబ్జెక్టివ్‌ తరహాలోనే నిర్వహించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నెలవారీ, ఆరు నెలల పరీక్షలను రద్దు చేశారు.


అదే విధముగా ఒకటి నుండి తొమ్మిదవతరగతి వరకు ఫార్మేటివ్ అసెస్మెంట్ సమ్మేటివ్, అసెస్మెంట్ పరీక్షల బదులు ఒక గ్రాండ్ టెస్ట్ పెట్టి ప్రమోట్ చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవలసి ఉంది.

Post a Comment

Previous Post Next Post