TS SET Exam 2022 Notification : టీఎస్ సెట్ 2022 ఉస్మానియా విశ్వవిద్యాలయం షెడ్యూల్ విడుదల చేసింది. డిసెంబర్ 30 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ప్రారంభం.మార్చి నెలలో పరీక్ష.
TS SET 2022 Notification:
తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (TS SET)ను ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) నిర్వహించనుంది. ఈ మేరకు ఓయూను నోడల్ ఏజెన్సీగా యూజీసీ (UGC) ఎంపిక చేసింది. యూనివర్సిటీలు, కాలేజీల్లో లెక్చరర్‌షిప్ పొందాలనుకునే అభ్యర్థుల అర్హతను నిర్ధారించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. 29 సబ్జెక్టులలో ఇది జరగనుంది. సెట్ కన్వీనర్‌గా ఓయూ ఆచార్యుడు సి.మురళీకృష్ణ వ్యవహరించనున్నారు. వర్సిటీలు, కాలేజీల్లో అధ్యాపకులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ప్రభుత్వం చొరవ తీసుకుంటున్న నేపథ్యంలో టీఎస్‌సెట్ కీలకం కానుంది. చివరిసారిగా 2019లో ఈ పరీక్ష జరగగా.. మూడేళ్లుగా పరీక్ష కోసం వేలమంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
TS SET Exam Pattern :
Session | Paper | Marks | Number of Questions | Duration |
---|---|---|---|---|
1 | I | 100 | 50 questions all are compulsory | 3 Hours |
II | 200 | 100 questions all are compulsory |
టిస్ సెట్ - 2022 పరీక్ష 2023 మార్చిలో నిర్వహిస్తామని సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సీ. మురళీకృష్ణ వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం.. డిసెంబర్ 30 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. కంప్యూటర్ ఆధారితంగా (Computer based test -CBT) నిర్వహించే పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.
3 గంటల వ్యవధిలో జరిగే పరీక్షలో పేపర్ 1 లో 50 ప్రశ్నలకు గాను 100 మార్కులు పేపర్ 2 లో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. 29 సబ్జెక్టులలో ఈ టెస్ట్ జరుగుతుంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారు ఆయా సబ్జెక్టులకు సంబంధించిన పోస్టుల రిక్రూట్మెంట్ లో పోటీ పడే అవకాశం ఉంటుంది. టీఎస్ సెట్ ను చివరిసారిగా 2019లో నిర్వహించారు.
తెలంగాణ జెఎల్ నోటిఫికేషన్ 2022- 23 : క్లిక్ చేయండి
తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు/లెక్చరర్లుగా పనిచేయడానికి అర్హత కల్పించే పరీక్ష తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (టీఎస్ సెట్)-2022 షెడ్యూలును ఉస్మానియా విశ్వవిద్యాలయం డిసెంబరు 22న విడుదల చేసింది. డిసెంబరు 30 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. చివరిసారిగా 2019లో సెట్ నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో రెండు సంవత్సరాలు సెట్ నిర్వహించలేదు. తాజాగా టీఎస్‌సెట్-2022 నిర్వహించనున్నారు.
వచ్చే ఏడాది మార్చి నెలలో ఆన్‌లైన్ ద్వారా టీఎస్ సెట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రస్తుతం పీజీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ - యూజీసీ ప్రకారం.. సెట్ లో అర్హత సాధించిన వారే.. ఆయా పోస్టులకి పోటీ పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో.. ఎంతో మంది ఆశావాహులు.. టీఎస్ సెట్ కోసం ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణకు తెరదించుతూ.. నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న ఓయూ షెడ్యూల్ ను ప్రకటించింది.
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టడంతో అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ కళాశాలల లెక్చర్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి. ఇప్పటికే సెట్ అర్హత సాధించిన వారు పోటీ పరీక్షల కోసం సన్నద్ధం అవుతుండగా.. కొత్తగా పీజీ పూర్తి చేసిన వారితో పాటు గతంలో అర్హత సాధించని వారు సెట్ పరీక్ష కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా ఉస్మానియా విశ్వవిద్యాలయం షెడ్యూల్ ప్రకటించడంతో వారంతా అర్హత సాధించడంపై దృష్టి సారించారు.
వచ్చే ఏడాది మార్చి నెలలో ఆన్‌లైన్ ద్వారా టీఎస్ సెట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
Post a Comment