TOSS : ఓపెన్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2020-21 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్ )ఆధ్వర్యంలో ఎస్ ఎస్ సి ,ఇంటర్ అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్లు టాస్ డైరెక్టర్ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు.
ముఖ్యమైన తేదీలు :
- డిసెంబర్ 10 నుండి జనవరి 15 వరకు
- ఫీజు వివరాలు : టెన్త్ : ఓసి జనరల్- 1100 /-
ఓసీ ఉమెన్ ,బీసీ, ఎస్సీ,ఎస్ టి, పి హెచ్ సి, మైనార్టీ-700 /-
ఇంటర్ : ఓసి జనరల్- 1300/-
ఓసి ఉమెన్,బిసి, ఎస్సీ, ఎస్ టి ,పి హెచ్ సి, మైనార్టీ 1000/-
- వెబ్సైట్ : telanganaopenschool.org
వచ్చే ఏడాది జనవరి 5 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు కట్టవచ్చు. జనవరి 15వరకు లేట్ ఫీజు తో దరఖాస్తు చేసుకొనవచ్చు మరిన్ని వివరాలకు వెబ్ సైట్ ను సందర్శించగలరు.
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఇంటి వద్దనే ఉండి చదువుకునే వారికి గొప్ప సువర్ణ అవకాశం ఇది. ఈ అవకాశాన్ని విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని టాస్ డైరెక్టర్ కృష్ణారావు తెలియజేశారు.
ఓపెన్ స్కూల్ లో చేరాలనుకున్న విద్యార్థులు ఆయా స్కూల్స్ కాలేజీలలో ఉన్నా స్టడీ సెంటర్ల లోని కోఆర్డినేటర్ లను కలిసి అడ్మిషన్స్ పొందవచ్చు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నివృత్తి కొనవచ్చును ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోగలరు.
إرسال تعليق