TSPSC Group 1 Edit Option : గ్రూప్ 1 అభ్యర్థులకు గుడ్ న్యూస్

 TSPSC Group 1 Edit Option :



గ్రూప్ 1 పోస్టులకు(Group 1) దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(Telangana Public Service Commission) ఓ కీలక ప్రకటన చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఫామ్ లో ఏమైనా తప్పులు ఉంటే ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ నెల 19 నుంచి 21 వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చని చెప్పింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణలో 503 గ్రూప్ 1 (TSPSC Group 1) ఖాళీల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఇటీవల నోటిఫికేషన్ (Telangana Jobs Notification) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది.

మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి


ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత పెద్ద సంఖ్యలో ఖాళీలలతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైన చరిత్ర లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి విడుదలైన తొలి నోటిఫికేషన్ కావడంతో లక్షలాది మంది నిరుద్యోగులు గ్రూప్ 1 ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్​ఎగ్జామ్​ను ఆక్టోబర్ 16 నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.మెయిన్స్‌ను జనవరి లేదంటే ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు పేర్కొంది


అయితే తాము గ్రూప్ 1 కు దరఖాస్తు సమర్పిస్తున్న క్రమంలో తప్పులు దొర్లాయని కమీషన్ కు కొందరు అభ్యర్థులు ఫోన్స్ చేయడం.. మెయిల్స్ చేయడం లాంటివి చేశారు. వాళ్ల అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న కమీషన్ దరఖాస్తుల్లో తప్పులను సరి చేసుకునేందుకు టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులకు అవకాశం కల్పించింది. ఈ నెల 19 నుంచి 21 వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చని చెప్పింది. దరఖాస్తులో తప్పులు దొర్లినట్లు ఎవరికైనా అనిపిస్తే.. వాళ్లు www.tspsc.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులను ఎడిట్‌ చేసుకోవచ్చని తెలిపింది.



పేరు, లింగం, పుట్టిన తేదీ, విద్యార్హత, ఫొటో, సంతకం వంటి వాటిని ఎడిట్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే సవరణలకు తగిన ధ్రువపత్రాలను అప్ లోడ్ చేయాలని సూచించింది. దీనికి సంబంధించి ప్రెస్ నోట్ ను కమీషన్ విడుదల చేసింది.

Post a Comment

Previous Post Next Post