TS Tenth class Exams 2022 Hall tickets download Started
byDr. Mokthala Murali-0
Comments
రేపటి నుంచి వెబ్ సైట్లో ఎస్సెస్సీ హాల్ టికెట్లు
ప్రైవేటు స్కూల్ ఫీజుల బాధలకు ఉపశమనం
TS Tenth class 2022 Hall tickets download :
ఫీజు బకాయిలు చెల్లించలేదని హాల్ టికెట్లు ఇవ్వకుండా ప్రైవేట్ స్కూళ్లు పెట్టే ఇబ్బందుల నుంచి విద్యార్థులను తప్పించేలా ఎస్సెస్సీ బోర్డు నిర్ణయం తీసుకున్నది. ఎస్సెస్సీ పరీక్షలు రాసే విద్యా ర్థులు తమ హాల్ టికెట్లను గురువారం నుంచి www.bse.telangana.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకొనే వెసులుబాటును కల్పించింది.
పదవ తరగతి పరీక్షలు ( ప్రతీకాత్మక చిత్రం)
హాల్ టికెట్లపై హెచ్ఎం సంతకం, స్కూల్ స్టాంప్ లేకున్నా పరీక్ష రాయొచ్చని వెల్లడించింది. ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు ఈ నెల 23 నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్ష ఉదయం 9:30 గంటలకు ప్రారంభంకానున్నది. 9:35 గంటల తర్వాత కేంద్రాల్లోకి అనుమతించరు.
Post a Comment