పదవ తరగతి 100% ఫలితాలకై ఉపాధ్యాయుల హామీ పత్రాలు
తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి 100% ఫలితాల కోసం ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచడంపై ఉపాధ్యాయులతో హామీ పత్రాలు తీసుకోవడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
![]() |
ఉపాధ్యాయులతో హామీ పత్రాలు |
విద్యా సంవత్సరంలో రెండు నెలల ఆలస్యంగా పాఠ్య పుస్తకాల పంపిణీ, వాలంటీర్లు ఇవ్వకుండా, జీతాలు పెన్షన్లు సకాలంలో చెల్లించ కుండా, మౌలిక సదుపాయాలు లేకుండా, ఎలాంటి పర్యవేక్షణ లేకుండా, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా ఇలాంటి టార్గెట్లు పెట్టడం పట్ల ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ ఇలా చేయడం వల్ల ఉపాధ్యాయులకు కూడా ఇది పరీక్ష గా మారింది విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలి అంటే ముందుగా ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
పది ఫలితాలు సాధించకపోతే చర్యలు
పదిలో 100% లక్ష్యాలు సాధించకపోతే చర్యలు తీసుకునేలా పలు జిల్లాల కలెక్టర్లు ఉపాధ్యాయులతో హామీ పత్రాలు తీసుకోవడంపై గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
పది ఫలితాలు ఉపాధ్యాయులకు తీవ్ర ఒత్తిడి పెంచే విధంగా కలెక్టర్ల చర్యలు ఉన్నాయి. పదవ తరగతి విద్యార్థులు ఇంతకుముందు పరీక్షల ఒత్తిడికి గురయ్యేవారు కానీ ఇప్పుడు ఉపాధ్యాయులు ఒత్తిడికి గురవుతున్నారు. కారణం ఏంటంటే కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు 100% ఉత్తీర్ణత సాధించాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ గారు ఉత్తర్వులు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కలెక్టరు అత్యుత్సాహం
పదవ తరగతి ఫలితాల్లో తమ జిల్లాలు నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్లు కోరుకోవడం సహజమే అయినప్పటికీ విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయకుండా మౌలిక సదుపాయాలు కల్పించకుండా నూటికి నూరు శాతం ఉత్తీర్ణత కోరుకోవడం సరైన విధానం కాదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. 10/10 జిపిఏ సాధించని పక్షంలో నాపై శాఖాపరమైన చర్యలు తీసుకోగలరని నా సమ్మతం తెలియజేస్తున్నాను అని సంగారెడ్డి విద్యాశాఖ యంత్రాంగం ఉపాధ్యాయుల నుంచి హామీ పత్రాలు తీసుకోవడం ప్రస్తుత సంగారెడ్డి కలెక్టర్ శరత్ గారు విద్యాశాఖ అధికారులకు ఆదేశాలివ్వడం పట్ల రాష్ట్ర ఉద్యోగ సంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుత సంగారెడ్డి కలెక్టర్ గా ఉన్న శరత్ గారు గతంలో జగిత్యాల కలెక్టర్ గా ఉన్న సమయంలో 2017 ,2018,2019 లో 10వ తరగతి ఉత్తీర్ణతలో అగ్రస్థానం పొందింది దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలవాలని హామీ పత్రాలు తీసుకుంటున్నట్లుగా ఉపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
12000 ఉపాధ్యాయ ఖాళీలు
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 2020 విద్యా సంవత్సరంలో 12000 విద్యా వాలంటీర్లు పనిచేయగా ప్రస్తుతం వారిని నియమించకపోగా రాష్ట్రంలో టెట్ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా 100% ఉత్తీర్ణత ఎలా సాధ్యమని టిఆర్టిఎఫ్, టీఎస్ యుటిఎఫ్, రాష్ట్ర గెజిటెడ్ ఉపాధ్యాయుల సంఘం నాయకులు ఒత్తిడి పెంచడం మూలంగా అనైతిక పోటీకి దారి తీస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ముందుగా పాఠశాలల్లో అర్హులకు స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతులు ఇవ్వాలి. ట్రాన్స్ఫర్స్ జరపాలి తర్వాత పోస్టులు భర్తీ చేయాలి. ఆ తర్వాత మాత్రమే ఇలాంటి టార్గెట్స్ పెట్టాలని వివరించారు.
ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే కాకుండా మిగతా జిల్లాల కలెక్టర్లు కూడా ఇదే విధంగా హామీ పత్రాలు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారని వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు వాపుతున్నారు.
ఉపాధ్యాయులు విద్యార్థులపై తీవ్రఒత్తిడి
ఒకవైపు భారత ప్రధాని మంకీ బాత్ లో విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించాలని ప్రయత్నం చేస్తుంటే కలెక్టర్లు ఈ విధంగా ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచడం సరైన విధంగా లేదని దీనివల్ల ఉపాధ్యాయులు విద్యార్థులపై ఒత్తిడి పెంచడం మూలంగా విద్యార్థులు ఒకవైపు ఉత్తీర్ణత సాధించకపోగా ఆత్మహత్య లాంటివి చేసుకునే అవకాశం ఉందని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఒత్తిడి పెంచే చర్యలు మానుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు మేధావులు యువజనులు కోరుకుంటున్నాను.
Post a Comment