Telangana Group 4 Job Notification 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్....!

 



Telangana Group 4: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులకు త్వరలో మరో గుడ్ న్యూస్ చెప్పనున్నారు. తెలంగాణలో గ్రూప్ 4 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ తీవ్ర కసరత్తు ప్రారంభించింది. ఇంటర్మీడియెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అర్హత, జిల్లా స్థాయి పోస్టులు కావడం, ఎక్కువ సంఖ్యలో ఖాళీలు ఉండటంతో చాలా మంది నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్​ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

  • తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఖాళీగా ఉన్న 9,168 పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది.
  • ఖాళీల వివరాలపై డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లతో ఆర్థిక శాఖ కసరత్తు ముమ్మరం చేసింది.
  • గ్రూప్ 4 ఖాళీ పోస్టులపై స్పష్టత వచ్చాక TSPSC నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల చేయాలని భావిస్తున్నారు.
  • నిరుద్యోగులకు ప్రిపరేషన్ కావడానికి తగిన సమయం ఇవ్వాలని భావిస్తోంది.
  • దరఖాస్తులు 10 లక్షల వరకు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Group 4 నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను త్వరగా ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే వివిధ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ల నుంచి అందిన ఖాళీ పోస్టుల వివరాలకు ఆర్థిక శాఖ అనుమతించింది. మరికొన్ని శాఖల్లో ఖాళీల వివరాలపై స్పష్టత ఇవ్వాలని ఆర్థిక శాఖ కోరింది. ఆయా శాఖల నుంచి సమాచారం వచ్చిన వెంటనే నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చేందుకుTSPSC కి అనుమతి ఇవ్వనున్నారు. మొత్తం ఖాళీలను ఒకేసారి భర్తీ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తుండటంతో, ఈ నెలఖారు కల్లా నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4లో మొత్తం 9,168 ఖాళీలు ఉన్నట్లు ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం తెలుస్తోంది.


అభ్యర్థులకు ప్రిపరేషన్ కు తగిన సమయం 

ఇప్పటికే గ్రూప్​1, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ, కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇందులో గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1, పోలీసు ఉద్యోగులకు ప్రిపేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యే వాళ్లు కూడా కచ్చితంగా గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2, 3కు పోటీ ఇస్తారు. దీంతో అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా నోటిఫికేషన్ల మధ్య గ్యాప్ ఇవ్వనున్నారు. ఈ రెండు నోటిఫికేషన్లకు కనీసం మూడు, నాలుగు నెలల సమయం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4 పోస్టుల భర్తీపై దృష్టి పెట్టింది. 

జిల్లా స్థాయి పోస్టులు కావడంతో ఒక్కో జిల్లాకు సగటున 300 పోస్టులు వచ్చే అవకాశం ఉంది. ఈ స్థాయిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఎప్పుడూ పోస్టులు రాలేదు. ఈ ఒక్క నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నిరుద్యోగులు ప్రిపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బిజీ అయిపోతారని, ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత చాలా వరకు పోతుందని భావిస్తున్నారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదు అన్న అపవాదు పోతుందని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోందని అధికారులు చెబుతున్నారు.


10 లక్షల వరకు దరఖాస్తులకు అవకాశం 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ల నుంచి గ్రూప్ 4 ఉద్యోగాలకు ఇండెంట్ ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4 ఉద్యోగుల అవసరం మరింత పెరిగింది. ఇప్పటి వరకు 5,200 పోస్టులకు సంబంధించి డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ల నుంచి క్లియరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చింది. ఇంకో 4500 పోస్టుల వివరాలపై స్పష్టత రాగానే ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వనుంది. ఒకవేళ ఉద్యోగం వస్తే సొంత జిల్లాలోనే జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకౌంటెంట్, స్టెనో హోదాలో పని చేసుకునేందుకు అవకాశం ఉంటుందని నిరుద్యోగులు భావిస్తున్నారు. దీంతో ఈ పోస్టులకు కనీసం 10 లక్షల​ మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తే ఇదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన భారీ TSPSC నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు.











 





Post a Comment

Previous Post Next Post