TS Open Tenth, Inter Annual Exams 2022:
ఓపెన్ టెన్త్‌లో ఆరు పేపర్లకే వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. రెగ్యులర్ ఎస్సెస్సీ తరహాలోనే ఓపెన్ స్కూల్స్‌కు కూడా 70 శాతం సిలబస్‌నే అమలు చేయనున్నారు. ప్రశ్నల్లో 50 శాతం చాయిస్ ఇవ్వనున్నారు. కాగా, ఈ పరీక్షలు ఈ నెల 31 నుంచి జూన్ 10 వరకు జరుగుతాయని ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ పీవీ శ్రీహరి సోమవారం తెలిపారు.
- మే 31 నుంచి పరీక్షలు.. ఓపెన్ ఇంటర్‌వి కూడా
- ఉదయం 8:30 గంటల నుంచి 11:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు.
- ఇంటర్, ఎస్సెస్సీ పరీక్షలు ఒకే రోజు సమాంతరంగా జరుగుతాయని, ఇందుకోసం ప్రత్యేకంగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు.
- వారం ముందుగానే హాల్‌టికెట్లను జారీ చేస్తామని పేర్కొన్నారు.
- జూన్ 21 నుంచి 25 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఓపెన్ టెన్త్‌లోనూ 6 పేపర్లే

Post a Comment